ధిక్కారం
**********
వారి మాటలు వినాలనే ఆసక్తి ఏ మాత్రం లేదు
తరతరాలుగా లేని ప్రేమలని ఒలకబోస్తూ
మా నడకలను నాడాలు కొట్టి
పరుగుపందెంలో నిలబెడుతున్నారు..
అంతుచిక్కని ఆంక్షలన్నీ
ఉగ్గుపాలనాడే పోసి ఊపిరిసలపనియ్యని పొగగొట్టంలా మార్చుతున్నారు.
అద్దంలో కనిపించే ప్రతిబింబం మాదికాదు
పైపై మెరుగులు దిద్దిందెవరో
అందంగా ముసుగులు వేసి
గంగిరెద్దులా అలంకరిస్తున్నారు
బంధాల పేరుతో ఒక్కో మెట్టు ఎక్కించి అందని ఎత్తునుంచి మమ్మల్ని అగాధంలోకి తోసేస్తున్నారు
ప్రేమపేరుతో వాళ్లూ విదిల్చే నాలుగు మెతుకులకు అంటిన నిర్లక్ష్యం మా గొంతుకు అడ్డంపడుతుంది
అవమానం,అసహనం,
అవసరాల నడుమ
మా కన్నీటిలో ఉప్పదనం చప్పబడిపోతుంది
మేము నడిచే తోవలో చుట్టూ నీడలే
మమ్ముల కావలి కాస్తూ
మా నడకల్ని నియంత్రిస్తూ
మా నవ్వుల్ని హెచ్చరిస్తూ
చూపుల్ని కత్తిరిస్తూ
మాటల్ని శాసిస్తూ
దారులను మళ్ళిస్తూ
మాలోని మమ్మల్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు
తాళలేక,
పెత్తనాన్ని సహించలేక
తిరగబడిబడితే శాశ్వతంగా సమాధి చేసి మరో తరానికి ముందస్తు హెచ్చరికలు జారీచేస్తున్నారు
బండబారిపోతుంది బ్రతుకు
బహుశా ఇదే ఆఖరి వంశం కావచ్చు
మున్ముందు తరాలకు
మా ఆనవాళ్లు ఆవగింజలుగా మారిపోయి కనుమరుగై పోతామేమో
లేదు.
అలా జరగకూడదు
వంటింట్లో,పడకటింట్లో మూగబోతున్న హృదయాలు మళ్లీ రవళించాలి..
రేపటి వారసత్వాలకు అది ఢమరుక నాదమై వినిపించాలి
తలదించుకున్నది చాలు
ధిక్కరించే చూపులు విసిరి
దిక్కులను కూల్చుకుని
ఒరుసుకుంటున్న సంకెళ్ళను తెంచుకుని
మళ్లీ కొత్తగా జన్మించాలి
సరికొత్తగా తలరాతను రాసుకోవాలి..
మేము మేముగా బ్రతకాలి..
(లావణ్య సైదీశ్వర్)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి