8, ఏప్రిల్ 2018, ఆదివారం

మల్లి

మల్లి
-Putcha Gayatri Devi

చల్ల గాలి వచ్చి నన్ను తాకినట్టు
బొండు మల్లె చెండు మురిసి నవ్వినట్టు
చిత్రిక పట్టిన టేకు చెక్కల్లె
వట్రంగ వంపులు తీర్చిదిద్దినట్టు

గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే
గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే

చిలకల జంట కువ కువలాడితే
చిగురుటాకులు రెండు తొంగి చూస్తూఉంటె
కరి మబ్బు చూసిన కేకికి మల్లె
నీరూపే గురుతొచ్చి మది నాట్యమాడెను

గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే
గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే

కొబ్బరి తోటలో నీటి బావిలగా
మండుటెండలోన వానజల్లులాగ
పొద్దున్న పాడేటి మేలుకొలుపులాగ
అమ్మపెట్టేటి సద్దిబువ్వలాగ

గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే
గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే

కంటి నిండా నిదుర కరవే అయ్యింది
పటికరాయి లాగ పలుకైన పలకవు
పగటిపూట ఉన్న చందురుడులాగ
కళ తప్పి నామోము వెలవెలబోయే

గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే
గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే

పి. గాయత్రిదేవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి