మేలు వాడే పూలు
గాలికి రుణపడి వుండాలి పూలు
పూలతనాన్ని గుండెల మీద మోసుకుంటూ
గాలి పడవలు దేశమంతా ఈదుతాయి
ఎక్కడో మూలల్లో అనామకంగా గడ్డకట్టిన
చీకటి పలకల్లా పడివున్న పూలను
ఇంటి పెరట్లోనే తచ్ఛాడుతున్న కొన్ని
వాక్యాల లతలను కూడా
గాలి తిరుగుళ్లు కొన్ని
లోకానికి పరిచయం చేస్తాయి
గాలి కదలికల్లో పూల చిరునామా
తొణికిసలాడుతుంది
నాలుగు గోడల మధ్య
అడవి కాచిన వెన్నెల గీతమొకటి
నగరమంతా కవితామయమవుతుంది
కొంత మంది మనుషులు కూడా అంతే
పూల చిరునామాను ప్రతిష్టించి
గాలిలా కనబడకుండా వుండి పోతారు
కనీసం పూలెక్కడా గాలి ఉనికిని
శ్వాసించవు కూడా
గాలి మాత్రం తన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో
పూల ఉనికికి వేదికవుతూనే వుంటుంది!
- చిత్తలూరి సత్యనారాయణ
గాలికి రుణపడి వుండాలి పూలు
పూలతనాన్ని గుండెల మీద మోసుకుంటూ
గాలి పడవలు దేశమంతా ఈదుతాయి
ఎక్కడో మూలల్లో అనామకంగా గడ్డకట్టిన
చీకటి పలకల్లా పడివున్న పూలను
ఇంటి పెరట్లోనే తచ్ఛాడుతున్న కొన్ని
వాక్యాల లతలను కూడా
గాలి తిరుగుళ్లు కొన్ని
లోకానికి పరిచయం చేస్తాయి
గాలి కదలికల్లో పూల చిరునామా
తొణికిసలాడుతుంది
నాలుగు గోడల మధ్య
అడవి కాచిన వెన్నెల గీతమొకటి
నగరమంతా కవితామయమవుతుంది
కొంత మంది మనుషులు కూడా అంతే
పూల చిరునామాను ప్రతిష్టించి
గాలిలా కనబడకుండా వుండి పోతారు
కనీసం పూలెక్కడా గాలి ఉనికిని
శ్వాసించవు కూడా
గాలి మాత్రం తన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో
పూల ఉనికికి వేదికవుతూనే వుంటుంది!
- చిత్తలూరి సత్యనారాయణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి