8, ఏప్రిల్ 2018, ఆదివారం

దహనవాటిక


దహనవాటిక - రత్నాల బాలకృష్ణ

దహించేది
ఒక అణువైనపుడు
దహించబడేదీ
ఒక అణువే
దహనం
నిరంతర ప్రక్రియ అయినపుడు
దగ్ధమవడానికి
భయపడతావెందుకు ?
శ్వాస నిశ్వాస క్రియలో
నిరంతరం వేల అణువులు
దగ్ధమవుతూనే వుంటాయి
చైతన్యం శ్వాసగా మారితే
దేహమంతా చైతన్య స్రవంతే!
ఆ స్రవంతి
అణువుకీ అణువుకీ మధ్య
అంగారమై
జ్వలించినపుడు
ప్రతి దేహమూ
ఒక దహనవాటికే!

               రత్నాల బాలకృష్ణ
                 విజయనగరం
          సెల్... 9440143488

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి