( ఈ రోజు (13-ఏప్రిల్ ) ప్రముఖు నవల రచయిత్రి - వాసిరెడ్డి సీతాదేవి గారి వర్ధంతి సందర్భం గా .......)
-----------------------------------------------------------_
కొందరి రచనలు కు గొప్పదనం ఆపాదించబడుతుంది. మరికొందరు గొప్పదనం కొసం రచనలు రాస్తారు.కానీ కొందరు ఒక అలవాటుగా రాస్తూ రాస్తూ గొప్పదనం ను సాధిస్తారు అలాంటి గొప్ప మంచి రచయిత్రి యే వాసిరెడ్డి సీతాదేవి గారు . వీరు గుంటూరు జిల్లా చేబ్రోలు లో జన్మించారు. వీరు ఎన్నో మంచి నవలలు రాసారు. వీరికీ నవలలు రాయడం అనేది వృత్తి కాదు. ఒక ప్రవృత్తి మాత్రమే. అయిన సరే సాహిత్యం లో ప్రజల ఉల్లాసం కొసం సమకాలీన అంశాలతో ప్రభోధత్మకం గా వీరి నవలా రచనలు సాగినవి.
వీరు విషకన్య ; తిరస్కృతి రాక్షస నీడ ; వైతారణి ; అడవి మల్లెలు ; ఊరితాడు ; రాబందులు - రామ చిలుకలు ;
సావేరి ; తోణకీన స్వప్నం ; బొమ్మరిల్లు ; నింగి నుండి నేలకు ; హసీనా ; బంధితుడు; వంటి నవలలు రాసారు.
సమకాలీన రచనలు చేయడం లో కొంత లౌక్యం అవసరం; నవల వస్తువు సార్వజనీకమై ఉండాలి. ముఖ్యం గా ఆ కాలంలోని ప్రభుత్వం కు వ్యతిరేకం అయి వుంటే ఇబ్బందులు తప్పవు. అలా వీరు నక్సలిజం పై రాసిన నవల " మరీచిక " (1982) ప్రభుత్వ నిషేధం కు గురికావలిసి వచ్చింది. ఆ కేస్ లో వాసిరెడ్డి గారు ఇబ్బంది పడవలిసి వచ్చింది. చివరికీ ఆరుద్ర వంటి సాహిత్య కారుల అభిప్రాయముల వలన కోర్ట్ కేస్ కొట్టివేయ బడినది.
తెలుగు పాఠకులకు విసిగించకుండా చదివించే నవలలు రాయడం అంత సులువెం కాదు. వీరి నవలలు భావోద్వేగం తో కూడి హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంటాయి. అందుకేనేమో ఒకసారి పాపులర్ అయి ప్రజల నోళ్లలో నానిన కూడా అవి సిన్మాలు సీరియల్స్ గా వెండితెర మీద ప్రత్యక్షం అయినాయి. 90 దశకం లో యద్దనపూడి సులోచనారాణి ; కొడూరి కౌసల్య దేవి వంటి వారి నవలలు సినిమాలు రావడం ; అలా తెరకెక్కిన నవల రచయిత్రి ల లో వాసిరెడ్డి గారు ఒకరు...
వీరి నవల రచనలలో సమత - ప్రజా నాయకుడు గా ;
ప్రతీకారం - మనస్సాక్షి గా ;
మానినీ మనస్సు - ఆమెకథ గా
మృగ తృష్ణ - అదే పేరు తో సినిమాలు గా అలరించాయి...
ఇంకా ఒక రచన సాహిత్యంలో కొత్తదనం తో కూడి పాఠకులను ఆకర్షించిన్నప్పడు అదీ ఆ రచన వివిధ భాషల లోకీ కూడా అనువాదం అవుతుంది. అలాంటి రచనే వీరు రాసిన " మట్టీ మనిషి " (2000). ఇదీ 14 భాషలలోకీ అనువదించబడినది.
సీతాదేవి గారి ప్రతిభ కు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ; శ్రీపద్మావతి యూనివర్సిటీ లు డి.లిట్ ను ప్రధానం చేసాయి. అంతే కాదు తెలుగు విశ్వవిద్యాలయం వారు వారికీ "జీవిత సాఫల్య పురస్కారం " ఇచ్చి గౌరవించారు. ఎపి సాహిత్య అకాడమీ అవార్డ్ ను 5సార్లు పొందిన వీరు జవహర్ బాలభవన్ కు డైరెక్టర్ గా ; 1985-1991 మధ్య కాలం లో ఫిల్మ్ సెన్సార్ సభ్యురాలిగా పనిచేసారు. 1998 లో సాహిత్య స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకున్న వాసిరెడ్డి సీతాదేవి గారు 2007 లో పరమపదించారు...
* ఐ.చిదానందం *
తెలుగు రీసెర్చ్ స్కాలర్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి