14, ఏప్రిల్ 2018, శనివారం

* మానవత్వం మరణించింది *
-------------------------------------------

పసి మొగ్గ లనీ తెంపేసే హీరా నగర లాంటి
ప్రాంతాలన్నీ నాశనం కావాలిసిందే
కనీసం పసిపాపలకీ కూడా రక్షణ ఇవ్వాలేని
రాతిగుళ్ళు ఇప్పుడీక రాక్షస గుళ్ళ్లే
పిశాచాలు తిరుగాడే స్మశాన వాటికలే

ఆ గుడి లో అత్యాచారం జరిపింది
నలుగురు కాదు
దేవుడి తో కలిపి ఐదుగురు
ఇప్పడిక గుడి పవిత్ర స్థలం కాదు
దేవుడు చచ్చి దయ్యమై తిరుగాడుతున్న
క్షుద్ర దేవతల పూజ స్థలం

ఆలింగనాలు అపవిత్రమైపోతున్నప్పడు
సంపర్కం సిగ్గు మాలినదైనప్పడు
స్కలనాలు మలినాలవుతున్నప్పడు
రతి రోత గా మారుతున్నప్పడు
మానవత్వం పశువై మంట కలుస్తున్నప్పడు
దైవత్వం దుష్టత్వం తో చేతులు కలుపుతున్నప్పడు
అయ్యో భగవంతుడా....
ఇక నిన్నూ ఏమనీ పూజించేది
కిరాతకులను శిక్షించలేని నిన్నూ
ముక్కు పచ్చలారనీ చిన్నారులనైనా
రక్షించలేని నిన్నూ
ఇక ఏమనీ పూజించేది

పశుత్వానికి ప్రతిరూపాలైనా ఆ మనుష్యులకీ
ఏ శిక్ష సరిపోతుంది
ఇంద్రుడిలా ఆ కామాంధులకీ వళ్ళంతా యోనులతో కుళ్ళిపోవాలి
మనుష్యులలో వున్న మృగాలను వంద సార్లు
కసి తీరా ఊరి తీయాల్సిందే
మానవత్వం మసి చేసే మనుష్యులను
తరిమి తరిమి కోటాల్సిందే


                                 *   ఐ.చిదానందం *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి