20, ఏప్రిల్ 2018, శుక్రవారం

                         కొన్ని జ్నాపకాలంతే
       
నిజం చెప్పొద్దూ!
కొన్ని జ్నాపకాలంతే!

వాటిని నెమరేసుకున్నపుడల్లా
అమ్మచేతి  కమ్మని కాఫీ నయిపోతాను
మామిడి  తోపుల్లో తిరుగాడే
బాల్యాన్నయిపోతాను

కాసేపు -
ఆ జ్నాపకాల జడివానలో
తడిసా. ..........క

పొరలు పొరలుగా విచ్చుకున్న
మట్టి పెళ్ళనై  పులకించిపోతుంటాను
చెలమనీటి ఊటనై ఊరుతుంటాను

స్మృతులన్నీ మననం చేసుకున్నాక
గుమ్మాన వేళ్ళాడే  మామిడి తోరణమై
మురిసిపోతుంటాను
కోయిలపాటల కమ్మదనమై
పరవశించిపోతుంటాను

కొత్త  చిగురులతో
కొమ్మకొమ్మనీ పలుకరించే
వసంతమై
ఏకంగా    పచ్చదనం పూసుకుంటాను
అమ్మమ్మ ఊరునై
మళ్ళీ..........మళ్ళీ. ......
ఊసుల్ని తడుముకుంటాను

                          చెళ్ళపిళ్ళ శ్యామల

17, ఏప్రిల్ 2018, మంగళవారం

అమ్మా ! గుడిలో దేవుడుంటాడమ్మా !

అమ్మా ఆ బూచోళ్ళంతా
ఏదో చేస్తున్నారమ్మా
నరకం చూస్తున్నానమ్మా
ఒళ్ళంతా ఏసిడ్ తో కడిగినంత
 బాధగా ఉందమ్మా
 నేనేంచేయగలను
అరుద్దామన్న
అరుపు గొంతుదాటి
 రావడంలేదు
 నేను కనిపించకపోయిన
దగ్గర నుండీ నాన్నా మీరంతా
 వేడుకుతుంటారని తెలుసు
మీ పక్కనే గుడిలోనే
 వున్నానని ఎలా చెప్పను
 గుడిలోనపూజారి కూడా
 తలుపులు తెరవడం లేదు
 అమ్మ గుడిలో దేవుడుంటాడా
 అమ్మా ?
నేను ఎంత ఏడుస్తున్నా
ఆ దేవుడు కూడా రావడం లేదమ్మా !
అమ్మా! చచ్చిపోతానేమోనని
 భయంగా ఉందమ్మా
అమ్మా చచ్చిపోవడం అంటే
 ఏంటమ్మా?
అమ్మా చనిపోతే దేవుడి
 దగ్గరకు పోతామని
 చిన్నప్పుడు నాన్నమ్మ చెప్పేది
 అమ్మ చనిపోతే నేను దేవుడి
 దగ్గరకు వెళ్లానమ్మా
అక్కడ దేవుళ్ళు కూడా
ఈ బూచోళ్లలాగే చేస్తారేమో
 నని భయమేస్తోందమ్మా
మరి చనిపోతే మీరెవ్వరూ
 నాకు కనపడరుకదమ్మా!
ఇక నాకు ఓపిక లేదమ్మా
కళ్ళు మూతలు పడుతున్నాయి
అమ్మ నా బొమ్మలు మాత్రం జాగ్రత్తగా ఉంచానమ్మా
ఆ ఆడపిల్ల బొమ్మలో
రోజూ నన్ను చూసుకో అమ్మా!
 అయ్యో ! నన్ను ఎక్కడికో
 ఈడ్చుకొని వెళ్తున్నారు
నా మెడకి తాడు కడుతున్నారు
చెట్టుకి కట్టి
 తాడును లాగేస్తున్నారు
 అమ్మా ఈ క్షణంలో కూడా ఒక్కసారి ఒక్కసారి
 నిన్ను గట్టిగా కావిలించుకొని
 ఏడ్వాలని ఉందమ్మా
 కళ్ళంట కనీసం నీటి చుక్కైనా
 రావడం లేదమ్మా
ఏడ్చి ఏడ్చి అవి యెప్పుడో
 ఇంకిపోయాయి
నా ఒళ్ళుని చూస్తే నాకే
 అసహ్యం వేస్తోందమ్మా
రక్తం ఎండి దెబ్బలతో ఒళ్ళంతా
 పుండైపోయిందమ్మా
నేను చనిపోయిన తర్వాత
 నువ్వు వస్తావని తెలుసు
 ఒక్కసారి నన్ను గట్టిగ
నీ చేతుల్లోనికి తీసుకొని
నా ఏడుపు కూడా
 నువ్వే ఏడుస్తావు కదూ!
 ఒక్కసారి నన్ను గట్టిగా
 పట్టుకోవమ్మా నీ ఒడిలో
 పూర్తిగా నిద్రపోతాను !

 (అభం శుభం తెలియని ఆసిఫా గొంతు నుండి)

రత్నాల బాలకృష్ణ
సెల్ నెం. 9440143488.

15, ఏప్రిల్ 2018, ఆదివారం

నా కవిత పేరు మాతృ భూమి.

పసిపాపల కేరింతల సవ్వడి
శుకపికరావముల కూతల సవ్వడి
కన్నె పిల్లల అందెల సవ్వడి
నా మాతృభూమికి సుప్రభాతం.

పసిడి పంటల పచ్చ దనం
పరిమళాల పూవుల సుగంధం
నీరెండ కాంతుల పచ్చదనం
నా మాతృభూమి కనుల సొగసుదనం.

కవిరాజుల కవితాహారం
మహారాజుల విజయ విహారం
వేదవిదుల విజ్ఞాన భాండారం
నా మాతృభూమికి సుమహారం .

స్వార్థ ప్రజల కుటిల నీతి
అసమర్థ నేతలు అవినీతి
నిస్వార్థ  వృత్తుల  భయభీతి
నా మాతృభూమి హృదయ వేదనాగీతి.

మాతృమూర్తి  మనసు మధురం
మాతృభూమి పలుకు మధురం
మాతృభూమి సేవ మధురం
మరచిన బ్రతుకు వ్యర్థం వ్యర్థం.

అరుదైన వేదాల అలరారు భూమి
అమృతమూర్తుల అపురూపమైన భూమి
అమృత జలాల పావన భూమి
నా మాతృభూమికి అరుదైన అలంకారం.

అన్ని లోకాల మరపించు పుణ్యక్షేత్రాలు
అన్ని మతాల మరపించు తీర్థ క్షేత్రాలు
అన్ని భాషల పలికించే ఏకైక దేశం
అన్ని దేశాలకు ఆదర్శం నా మాతృభూమి

ఇటువంటి నా మాతృభూమికి వందనం అభివందనం.

ఈ కవిత నేను రచించినది. దేనికి అనుకరణ కాదు.
నా ఎస్. కె. నంబరు 2359

నా పేరు డా. దేవులపల్లి పద్మజ
ఊరు విశాఖ

14, ఏప్రిల్ 2018, శనివారం

పైశాచిక వాదమొకటి // మౌనశ్రీ మల్లిక్

ఎవరికి వారే మేధావులమని తీర్మానించుకున్నాక
గురువుల మాటలకు విలువెక్కడిది?

ఇప్పడు ఎవరింటి పెంటను వారే
చిల్లుల గంపలో నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు

ఆ గుంపును పలుకరించారో
ఆ కంపును కాస్త మీమీద దులపరిస్తారు
మిమ్మల్ని చీకాకు లోయల్లోకి నెట్టేస్తారు

అడుసులో పోర్లుతూ ఆనందించే పందుల మందను
మంచినీటి చెరువుల్లాంటి మీ హృదయాల్లోకి ఆహ్వానించకండి
మురికి కూపాలుగా మారుస్తాయి

అజ్ఞానం అహంకారంగా పరిణామం చెంది
వికృత మనస్తత్వ  పైశాచిక వాదమొకటి
అప్రకటితంగా విస్తరిస్తూ విలయతాండవం చేస్తుంది
కాస్త అప్రమత్తంగా ఉండండి!

వారికేం చెప్పాలనుకోకండి
కులగజ్జి కుక్కలై దాడికి తెగబడతారు
మతపిచ్చి మృగాలై మంటలు పెడతారు

వారు మీలాగే పైకి మామూలు మనషులుగా కనిపిస్తారు
మీరు కలిసినప్పుడు అన్నా తమ్ముడూ అంటూ కౌగిలించుకొని ఆప్యాయతను ఒలకబోస్తారు
నిజమని నమ్మకండి అంచలంచెలుగా
నయవంచన దిగుతారు

వారి అంతరంగంలో ఏ మేధకు అందని
అసూయ ధ్వేషాలు బుసకొడుతుంటాయి
నిత్యం మీకు కళంకాన్ని అంటగట్టి
పతనం చేయలని ఆలోచిస్తూనే ఉంటారు

వారు గొంగళిపురుగు దశనే ఇష్టపడతారు
సీతాకోక చిలుకలుగా మారి బతకాలనుకోరు
వారిని మార్చాలనుకుంటే అబాసుపాలవుతారు!

మీ కామెంట్ వారి దాడికొక ఊతం
మీ ఆర్గ్యుమెంట్ వారికొక వినోదపు ఉత్సవం

ఆ నరరూప రాక్షసుల సమూహంలోని
వారిని గుర్తిస్తే జరభద్రం
వారూ జిహాద్ తీవ్రవాదులకన్నా ప్రమాదకరం

వారికి మీ ఆలోచన స్రవంతిలోకి చొరబడే
అవకాశం ఎప్పుడూ ఇవ్వకండి!

వీలైతే అన్ ఫ్రెండ్ చేయండి
లేదంటే ఏకంగా బ్లాక్ చేయండి

లేకుంటే ఆ మూర్ఖశిఖామణులకు
బలిపశువులుగా మారుతారు.
-----^^^^----
బద్దలుకొట్టండి...

కాసిని నీళ్లతో
స్నానం చేయండ్రా...
మతంతో కాదు..

కడుపుకు కాసింత
అన్నం తినండ్రా...
మతమనే
అశుద్ధాన్ని కాదు...

కాసింత చల్లని
గాలిని
పీల్చుకోండిరా...
మతమనే
మత్తును కాదు...

కాసిని పూల
పరిమళాలను
నెత్తిన
జల్లుకోండ్రా...
మతమనే
దుర్గంధాన్ని కాదు...

ఇప్పటికైనా
మతం పునాదుల
మీద
కట్టిన రోషపు
కోటల్ని
బద్దలు కొట్టి
అట్టడుగు పొరల్లో కొట్టుకులాడుతున్న
మానవత్వాన్ని
మళ్లీ తొడుక్కోండ్రా...

ఇప్పుడీ దేశానికి
మనుషులే కావాలి..
మీ మతాలు, కులాల
కంపులు కాదు...

అమూల్యచందు
పల్లె ఒక పురాతన జ్ఞాపకం?!?
**************************
అనగనగా ఊరుండేది...
ఇప్పుడిలాగే అనాల్సొస్తుందేమో!
పల్లెవెలుగులు
పట్నపు రహదారులప్రక్క
గుడిసె దీపాలై పడుండంచూస్తుంటే
పల్లె ఆనవాలు గూగూల్ పటం
గుర్తు పట్టలేదంటే...
ఇప్పుడనాలనిపిస్తుంది
అనగనగా...ఒక పల్లె
ఉండేదని.....

సిమ్మెంటు కట్టలక్రింద
చిదుగుతున్న ఎముకలు
పునాది రాళ్ళ క్రింద సమాధులైన
బతుకులు...
అన్నం పెట్టాల్సన చేతులు
సున్నం కలుపుతుంటే...
పదారణాల జానపదం
రైలు పట్టాలకింద పడి....తునకలైతపోతుంటే..
అనగనగా....ఒక వాడ ఉండేదని
ఇప్పు డనాల్సి...వస్తుంది ...

దుబాయ్ కొరడా ఝుళిపింపులు
అమెరికా వీసా జడిపింపులు
చెన్నై...శ్రమదోపిడీ దారుణాలు
మట్టిని తలకెత్తుకున్నవాడు
మట్టిలో కూరుకుపోతే...
పైరుగాలిలాంటివాడు
పొగగొట్టమైపోతే....
అనగనగా ఒక గూడేం
ఒకప్పుడుండేదనాల్స వస్తుంది!

పట్నంలో...పనినేరుకుంటున్న
అన్న దాతను..చూసినప్పుడు
అనగనగా...ఒక పాడు ఉండేదట
అనాల్సొస్తుందిపుడు....
మృగ్యమౌతున్న పల్లె
మృగతృష్ణ లాంటి...వలస బతుకు
అన్న రాశులమాగాణి
ఆకాశ హార్మ్యంగా....మారుతుంటే
అభివృద్ధిలో ఉన్నమో
అధః పాతాళంలో ఉన్నామో....తెలీదుకానీ
పల్లె మాత్రం....ఒక భూతకాల జ్ఞాపకం!
***********************************
-------------కిలపర్తి దాలినాయుడు
************************************



( ఈ రోజు (13-ఏప్రిల్ ) ప్రముఖు నవల రచయిత్రి - వాసిరెడ్డి సీతాదేవి గారి వర్ధంతి సందర్భం గా .......)
-----------------------------------------------------------_

కొందరి రచనలు కు గొప్పదనం ఆపాదించబడుతుంది. మరికొందరు గొప్పదనం కొసం రచనలు రాస్తారు.కానీ కొందరు ఒక అలవాటుగా రాస్తూ రాస్తూ గొప్పదనం ను సాధిస్తారు అలాంటి గొప్ప మంచి రచయిత్రి యే వాసిరెడ్డి సీతాదేవి గారు . వీరు గుంటూరు జిల్లా చేబ్రోలు లో జన్మించారు. వీరు ఎన్నో మంచి నవలలు రాసారు. వీరికీ నవలలు రాయడం అనేది వృత్తి కాదు. ఒక ప్రవృత్తి మాత్రమే. అయిన సరే సాహిత్యం లో ప్రజల ఉల్లాసం కొసం సమకాలీన అంశాలతో ప్రభోధత్మకం గా వీరి నవలా రచనలు సాగినవి.
                       వీరు విషకన్య ; తిరస్కృతి రాక్షస నీడ ; వైతారణి ; అడవి మల్లెలు ;  ఊరితాడు ; రాబందులు - రామ చిలుకలు ;
సావేరి ;  తోణకీన స్వప్నం ; బొమ్మరిల్లు ; నింగి నుండి నేలకు ; హసీనా ; బంధితుడు;  వంటి నవలలు రాసారు.

                    సమకాలీన రచనలు చేయడం లో కొంత లౌక్యం అవసరం; నవల వస్తువు సార్వజనీకమై ఉండాలి. ముఖ్యం గా ఆ కాలంలోని ప్రభుత్వం కు వ్యతిరేకం అయి వుంటే ఇబ్బందులు తప్పవు. అలా వీరు నక్సలిజం పై రాసిన నవల  " మరీచిక " (1982) ప్రభుత్వ నిషేధం కు గురికావలిసి వచ్చింది. ఆ కేస్ లో వాసిరెడ్డి గారు ఇబ్బంది పడవలిసి వచ్చింది. చివరికీ ఆరుద్ర వంటి సాహిత్య కారుల అభిప్రాయముల వలన కోర్ట్ కేస్ కొట్టివేయ బడినది.

           తెలుగు పాఠకులకు విసిగించకుండా చదివించే నవలలు రాయడం అంత సులువెం కాదు. వీరి నవలలు భావోద్వేగం తో కూడి హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంటాయి. అందుకేనేమో ఒకసారి పాపులర్ అయి ప్రజల నోళ్లలో నానిన కూడా అవి సిన్మాలు సీరియల్స్ గా వెండితెర మీద ప్రత్యక్షం అయినాయి.  90 దశకం లో యద్దనపూడి సులోచనారాణి ; కొడూరి కౌసల్య దేవి వంటి వారి నవలలు సినిమాలు రావడం ; అలా తెరకెక్కిన నవల రచయిత్రి ల లో  వాసిరెడ్డి గారు ఒకరు...
              వీరి నవల రచనలలో సమత - ప్రజా నాయకుడు గా ;
ప్రతీకారం - మనస్సాక్షి గా ;
మానినీ మనస్సు - ఆమెకథ గా
మృగ తృష్ణ - అదే పేరు తో సినిమాలు గా అలరించాయి...

                    ఇంకా ఒక రచన సాహిత్యంలో  కొత్తదనం తో కూడి పాఠకులను ఆకర్షించిన్నప్పడు అదీ ఆ రచన వివిధ భాషల లోకీ కూడా అనువాదం అవుతుంది. అలాంటి రచనే వీరు రాసిన " మట్టీ మనిషి " (2000). ఇదీ 14 భాషలలోకీ అనువదించబడినది.

                   సీతాదేవి గారి ప్రతిభ కు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ; శ్రీపద్మావతి యూనివర్సిటీ లు డి.లిట్ ను ప్రధానం చేసాయి. అంతే కాదు తెలుగు విశ్వవిద్యాలయం వారు వారికీ "జీవిత సాఫల్య పురస్కారం " ఇచ్చి గౌరవించారు. ఎపి సాహిత్య అకాడమీ అవార్డ్ ను 5సార్లు పొందిన వీరు జవహర్ బాలభవన్ కు డైరెక్టర్ గా ; 1985-1991 మధ్య కాలం లో ఫిల్మ్ సెన్సార్ సభ్యురాలిగా పనిచేసారు. 1998 లో సాహిత్య స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకున్న  వాసిరెడ్డి సీతాదేవి గారు 2007 లో పరమపదించారు...


                             *    ఐ.చిదానందం *
                          తెలుగు రీసెర్చ్ స్కాలర్
 నేనయితే కవితలను చదివేటప్పడూ కవి పేరు చూడను. బాగుంటే నిర్మొహమాటంగా మెచ్చుకుంటాను.
కొందరి కీ కొన్నీ రకాల శైలి నచ్చవచ్చు. అలాంటి వాటికీ స్పందన తరుచుగా ఇస్తారు. ఉదాహరణ కీ ప్రేగడ కృష్ణ గారి కవితా విధానం శైలి నాకు నచ్చుతాయి.ఇంకా బిక్కి కృష్ణ గారి విమర్శ లు ; గవిడి శ్రీనివాస్ తత్విక కవితలు ; అభిరాం కవితలు (కానీ పదే పదే మనీ కవితలు చదవడం నాకైతే రుచించదు ) మీ కవితలలో ఉపమానాలు (కానీ ఒకే శైలిలో ఉంటాయి ) ; సొమన్న గారి వెన్నల బాల పదాలు (వీరూ కూడా ఇతరుల కవితలకు స్పందన చేయరు ) ; శ్రీకాంత్ గారి మొగ్గలు ; ప్రత్యేకం సునీత గారి కవితలు ; దేవుల పల్లి పద్మజ గారి కవితలు ; రాచేపాలెం విమర్శ (కొన్నీ నచ్చకున్నా ) అన్నీ ఆసక్తీకరం ;  ఇంకా పద్మవతి గారి ..
ఇలా అందరివి కొంచెం కష్టం - కొంచెం ఇష్టం....
 అలాగని అన్నీ కవితలు బాగున్నాయి అనీ చెప్పను. నచ్చిన వాటికై స్పందిస్తాను.( కానీ కవిత్వం లో ఒకే శైలి కంటె భిన్నం గా రాస్తే బాగుంటుంది )
[13/04 10:58 am] Gavidi Srinivas: I.సదానందం
కొన్ని జీవాలంతే

కుక్కపిల్ల తన తోకను పట్టుకోవటానికి
తనచుట్టూ తానే తిరుగుతుంది
అదేదో ఆటనుకొని తనను తానే కొరుక్కొని
బాధతో విలవిలాడుతుంది

ఈ జీవి కూడా అంతే
సాధించైనా ఏదో సాధించేయ్యాలని
అయిన వారిని బాధిస్తుంది
గుండెకు గాయం చేస్తుంది
తాను బాధలు సృష్టించుకుంటుంది
జీవితం నాశనం చేసుకుంటుంది
కొన్నిసార్లు శరీరమే కాల్చుకుంటుంది

ఆ కుక్కపిల్లది అమాయకత్వం
ఈ జీవిది మూర్ఖత్వం, కొన్ని జీవాలింతే

తన రెక్కల వెలుతురో బ్రతుకు సాగించే
మిణుగురు పురుగును చూసైనా నేర్చుకోదు
దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని
మసక వెలుతురులోనుంచి బ్రతుకును
వెలుగు రేఖలలోకి మళ్ళించుకోవాలని

ప్రక్కవాడి కొవ్వొత్తి వెలుతురు గుడ్డి దీపమని
ఎగతాళి చేసి మనసు గాయం చెయ్యటం తప్ప

కష్టపడి ఒకొక్క పుల్ల ఏరి మరీ
గూడు కట్టే పిట్టను చూసైనా నేర్చుకోదు
జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కి నిలబడాలని
తలమీద కెక్కి తొక్కి హింసించటం తప్ప

కొన్ని జీవాలింతే
ఆ బ్రతుకు అట్లా తెల్లార్సిందే ....

.... మోహనరాగం Krish Chintalapati 
ధిక్కారం
**********
వారి మాటలు వినాలనే ఆసక్తి ఏ మాత్రం లేదు
తరతరాలుగా లేని ప్రేమలని ఒలకబోస్తూ
మా నడకలను నాడాలు కొట్టి
పరుగుపందెంలో నిలబెడుతున్నారు..
అంతుచిక్కని ఆంక్షలన్నీ
ఉగ్గుపాలనాడే పోసి ఊపిరిసలపనియ్యని పొగగొట్టంలా మార్చుతున్నారు.

అద్దంలో కనిపించే ప్రతిబింబం మాదికాదు
పైపై మెరుగులు దిద్దిందెవరో
అందంగా ముసుగులు వేసి
గంగిరెద్దులా అలంకరిస్తున్నారు

బంధాల పేరుతో ఒక్కో మెట్టు ఎక్కించి అందని ఎత్తునుంచి మమ్మల్ని అగాధంలోకి తోసేస్తున్నారు

ప్రేమపేరుతో వాళ్లూ విదిల్చే నాలుగు మెతుకులకు అంటిన నిర్లక్ష్యం మా గొంతుకు అడ్డంపడుతుంది
అవమానం,అసహనం,
అవసరాల నడుమ
మా కన్నీటిలో ఉప్పదనం చప్పబడిపోతుంది

మేము నడిచే తోవలో చుట్టూ నీడలే
మమ్ముల కావలి కాస్తూ
మా నడకల్ని నియంత్రిస్తూ
మా నవ్వుల్ని హెచ్చరిస్తూ
చూపుల్ని కత్తిరిస్తూ
మాటల్ని శాసిస్తూ
దారులను మళ్ళిస్తూ
మాలోని మమ్మల్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు

తాళలేక,
పెత్తనాన్ని సహించలేక
తిరగబడిబడితే శాశ్వతంగా సమాధి చేసి మరో తరానికి ముందస్తు హెచ్చరికలు జారీచేస్తున్నారు

బండబారిపోతుంది బ్రతుకు
బహుశా ఇదే ఆఖరి వంశం కావచ్చు
మున్ముందు తరాలకు
మా ఆనవాళ్లు ఆవగింజలుగా మారిపోయి కనుమరుగై పోతామేమో
లేదు.
అలా జరగకూడదు
వంటింట్లో,పడకటింట్లో మూగబోతున్న హృదయాలు మళ్లీ రవళించాలి..
రేపటి వారసత్వాలకు అది ఢమరుక నాదమై వినిపించాలి

తలదించుకున్నది చాలు
ధిక్కరించే చూపులు విసిరి
దిక్కులను కూల్చుకుని
ఒరుసుకుంటున్న సంకెళ్ళను తెంచుకుని
మళ్లీ కొత్తగా జన్మించాలి
సరికొత్తగా తలరాతను రాసుకోవాలి..
మేము మేముగా బ్రతకాలి..

       (లావణ్య సైదీశ్వర్)
‌ మేలు వాడే పూలు


గాలికి రుణపడి వుండాలి పూలు
పూలతనాన్ని గుండెల మీద మోసుకుంటూ
గాలి పడవలు దేశమంతా  ఈదుతాయి

ఎక్కడో మూలల్లో అనామకంగా గడ్డకట్టిన
చీకటి  పలకల్లా  పడివున్న పూలను
ఇంటి పెరట్లోనే తచ్ఛాడుతున్న కొన్ని
వాక్యాల లతలను కూడా
గాలి తిరుగుళ్లు కొన్ని
లోకానికి పరిచయం చేస్తాయి

గాలి కదలికల్లో పూల చిరునామా
తొణికిసలాడుతుంది
నాలుగు గోడల మధ్య
అడవి కాచిన వెన్నెల గీతమొకటి
నగరమంతా కవితామయమవుతుంది

కొంత మంది మనుషులు కూడా అంతే
పూల చిరునామాను ప్రతిష్టించి
గాలిలా కనబడకుండా వుండి పోతారు

కనీసం పూలెక్కడా గాలి ఉనికిని
శ్వాసించవు కూడా
గాలి మాత్రం తన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో
పూల ఉనికికి వేదికవుతూనే వుంటుంది!

           - చిత్తలూరి సత్యనారాయణ
* మానవత్వం మరణించింది *
-------------------------------------------

పసి మొగ్గ లనీ తెంపేసే హీరా నగర లాంటి
ప్రాంతాలన్నీ నాశనం కావాలిసిందే
కనీసం పసిపాపలకీ కూడా రక్షణ ఇవ్వాలేని
రాతిగుళ్ళు ఇప్పుడీక రాక్షస గుళ్ళ్లే
పిశాచాలు తిరుగాడే స్మశాన వాటికలే

ఆ గుడి లో అత్యాచారం జరిపింది
నలుగురు కాదు
దేవుడి తో కలిపి ఐదుగురు
ఇప్పడిక గుడి పవిత్ర స్థలం కాదు
దేవుడు చచ్చి దయ్యమై తిరుగాడుతున్న
క్షుద్ర దేవతల పూజ స్థలం

ఆలింగనాలు అపవిత్రమైపోతున్నప్పడు
సంపర్కం సిగ్గు మాలినదైనప్పడు
స్కలనాలు మలినాలవుతున్నప్పడు
రతి రోత గా మారుతున్నప్పడు
మానవత్వం పశువై మంట కలుస్తున్నప్పడు
దైవత్వం దుష్టత్వం తో చేతులు కలుపుతున్నప్పడు
అయ్యో భగవంతుడా....
ఇక నిన్నూ ఏమనీ పూజించేది
కిరాతకులను శిక్షించలేని నిన్నూ
ముక్కు పచ్చలారనీ చిన్నారులనైనా
రక్షించలేని నిన్నూ
ఇక ఏమనీ పూజించేది

పశుత్వానికి ప్రతిరూపాలైనా ఆ మనుష్యులకీ
ఏ శిక్ష సరిపోతుంది
ఇంద్రుడిలా ఆ కామాంధులకీ వళ్ళంతా యోనులతో కుళ్ళిపోవాలి
మనుష్యులలో వున్న మృగాలను వంద సార్లు
కసి తీరా ఊరి తీయాల్సిందే
మానవత్వం మసి చేసే మనుష్యులను
తరిమి తరిమి కోటాల్సిందే


                                 *   ఐ.చిదానందం *
నిశ్శబ్ద మరణం
       .............
మనం కలిసి
కలలు కంటున్న ఓ రాత్రి
హఠాత్తుగా అదృశ్యమై పోయినట్లు
మనసు నెవరో
మెత్తగా పట్టి
ముక్కలు చేసిన చప్పుడు
మన గాయాల స్పర్శ తాకి
నిద్రిస్తున్న నల్ల మందారాలు
విస్మయంగా విచ్చుకుంటున్న
వెగటు వాసన..
నమ్మకంగా మనం నిర్మించుకున్న
ఆత్మీయ సౌధాలు
నిర్వీర్యమై..నిర్వికారమై..
నేలకూలిన నిశ్శబ్ద శబ్దం
నేస్తం..!
నీ గుండె సవ్వడి నాకు వినపడడం లేదు..
మనం..ఇంకా...బతికే వున్నామా???
       ........

సునీత గంగవరపు -

    ....................
*మనిషే..!*👹

           //- సంగెవేని రవీంద్ర

ప్రశాంతంగా అలా అలా
నడుస్తున్నా...
చుట్టూ పరిమళాల
పూదోటలు...

పలకరింతలు...
పులకరింతలు
కేరింతలు.. కవ్వింతలు
మనిషితనంతో పరిసరాలు
పరవశిస్తున్నయ్...

అకస్మాత్తుగా
ఎదో దుర్గంధం
ముక్కుపుటలదిరేలా..
గుండె తలుపులు పగిలేలా...

అటు చూసాను
వాడొస్తున్నాడు...
వాడి ఒళ్ళంతా కుళ్ళిన పెండ..
చేతిలో *మతం* జెండా..!!
న్యూనతా భావం

అలవాటుగా
గుండె
రోదిస్తోంది ...

మనసు
కసిగా చూస్తోంది ...

మనసు
చాలా గడుసు ...

ఎపుడు
ఏం చెయ్యాలో
బాగా తెలుసు ...

అంతే కాదు
మనసుకి
ఆ కారణం కూడ
తెలుసు ...

కారణం
ఈ రణం వల్ల
వచ్చే సొట్టలు
తనలోనే
దాగుంటయ్ ...

ఆ రణం పేరు
ఆత్మ న్యూనత ...

ఆ ముడుతలు ...

ఆత్మ న్యూనత
మనిషి
తనలో తాను
ఓ ఉమ్మెత్తలా
ముడుచుకు పోతే
వచ్చే ముడుతలు ...

ఇన్ని తెలిసిన
మనసుకు
సరి చేసే
సామర్థ్యం కూడా
తెలుసు ...

ఆత్మ న్యూనత
కల వారికి
సామర్థ్యం
తక్కువ కాదు ...

ఈ సమస్యకు
మూలం
తను
తనకు తాను
తక్కువ
అనుకోవడం ...

మనసు
మక్కువగా ...

సృష్టిలో
ఎక్కువలు
ఎక్కువగా
చూపి ...

ఆ తక్కువను
పక్కకు చేర్చింది ...

ఆత్మ న్యూనతలో
న్యూనత
విశ్వాసంగా
మారింది ...

అలా
ఆత్మ విశ్వాసం
వెతికిన
మనసు ...

దానిని
గుండెకు
అతికింది ...

చితికిన
గుండె బతికింది ...

           ........ ✍ "కృష్ణ"  కలం
🌸*సహజవాక్యం*🌸

పువ్వుకు పంచడమే తెలుసు
పరిమళించడం దాని సుగుణం

మొగ్గకు పూయడమే తెలుసు
వికసించడం దాని సహజగుణం

గాలికి వీయడమే తెలుసు
వాసంతసమీరం దాని లక్షణం

మొక్కకు ఎదగడమే తెలుసు
నీడనివ్వడం దాని ఉపకారం

కనురెప్పకు కాపాడడమే తెలుసు
కంటిరక్షణ దాని భద్రతాకవచం

ప్రకృతికి పచ్చదనమే తెలుసు
బతకనివ్వడం దాని జీవితం

కర్పూరానికి కరగడమే తెలుసు
సువాసన పంచడం దాని నైజం

ప్రేమకు ఇవ్వడమే తెలుసు
ఆత్మీయతచాటడం దాని అనురాగం

కలానికి రాయడమే తెలుసు
కవితలల్లడం దాని బలం

కాలానికి సాగిపోవడమే తెలుసు
జ్ఞాపకాలబంధం దాని సుగంధం

                     ✍ *భీంపల్లి శ్రీకాంత్*
యాది
Putcha Gayatri Devi
చల్ల గాలి వచ్చి నన్ను తాకినట్టు
బొండు మల్లె చెండు మురిసి నవ్వినట్టు
చిత్రిక పట్టిన టేకు చెక్కల్లె
వట్రంగ వంపులు తీర్చిదిద్దినట్టు

గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే
గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే

చిలకల జంట కువ కువలాడితే
చిగురుటాకులు రెండు తొంగి చూస్తూఉంటె
కరి మబ్బు చూసిన కేకికి మల్లె
నీరూపే గురుతొచ్చి మది నాట్యమాడెను

గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే
గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే

కొబ్బరి తోటలో నీటి బావిలగా
మండుటెండలోన వానజల్లులాగ
పొద్దున్న పాడేటి మేలుకొలుపులాగ
అమ్మపెట్టేటి సద్దిబువ్వలాగ

గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే
గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే

కంటి నిండా నిదుర కరవే అయ్యింది
పటికరాయి లాగ పలుకైన పలకవు
పగటిపూట ఉన్న చందురుడులాగ
కళ తప్పి నామోము వెలవెలబోయే

గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే
గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే

పి. గాయత్రిదేవి.
*తెగిన తాడు*
పండించిన పత్తే
మెత్తటి కత్తై
కుత్తుక కోసిందని
నమ్మలేక
కళ్ళలో నీళ్ళతో
చెంపల్ని తడుపుతూ
రోదనతో కూడిన
ఆవేదనతో
దక్షిణ దిక్కునే
చూస్తున్నదామె
తెగిపడిన
మెళ్ళో తాడు
అతుక్కుంటుందేమోనని
        అభిరామ్ ఆదోని 9704153642

8, ఏప్రిల్ 2018, ఆదివారం

నెరూడా

నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు.....
(పాబ్లో నెరూడా. స్పానిష్ కవి)
(అనువాదం:  తోలేటి జగన్మోహనరావు)

నువ్వు  పర్యటించకపోతే,
నువ్వు చదవకపోతే,
నువ్వు జీవిత ధ్వనులను వినకపోతే,
నిన్ను నువ్వు  అభిమానించకపోతే,
నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు

నీ ఆత్మ గౌరవాన్ని నువ్వు చంపుకున్నప్పుడు,
సహాయం చేసే చెయ్యి  అందుకోనప్పుడు,
నువ్వు మెల్లగా మరణించడం మొదలు పెడతావు

నీ అలవాట్లకు నువ్వు బానిస అయినప్పుడు,
అదే దారిలో రోజూ నడుస్తున్నప్పుడు,
నువ్వు అలవాటుగా చేసే పని మార్చనప్పుడు,
నువ్వు వివిధ రంగులు ధరించనప్పుడు,
లేదా అపరిచయస్తులతో  మాట్లాడనప్పుడు,
నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు

ఆవేశాన్నీ, ఆవేశం సృష్టించే అల్లకల్లోల భావాల్నీ,
నీ కళ్ళను చెమ్మగిల్లేలా,
నీ గుండె వేగంగా కొట్టుకునేటట్లు చేసే సంఘటనలనూ,
 నువ్వు తప్పించుకు తిరుగుతున్నప్పుడు,
నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు
నీ భద్రతను వదలి అనిశ్చితిలోకి నువ్వు అడుగు పెట్టనప్పుడు,
నువ్వు ఒక కల వెనుక పరిగెట్టనప్పుడు,
జీవితంలో కనీసం ఒక్కసారి,
నువ్వు పరిగెట్టనప్పుడు...
నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు
నీ జీవితాన్ని ప్రేమించు,
నిన్ను నువ్వు ప్రేమించు.....

దహనవాటిక


దహనవాటిక - రత్నాల బాలకృష్ణ

దహించేది
ఒక అణువైనపుడు
దహించబడేదీ
ఒక అణువే
దహనం
నిరంతర ప్రక్రియ అయినపుడు
దగ్ధమవడానికి
భయపడతావెందుకు ?
శ్వాస నిశ్వాస క్రియలో
నిరంతరం వేల అణువులు
దగ్ధమవుతూనే వుంటాయి
చైతన్యం శ్వాసగా మారితే
దేహమంతా చైతన్య స్రవంతే!
ఆ స్రవంతి
అణువుకీ అణువుకీ మధ్య
అంగారమై
జ్వలించినపుడు
ప్రతి దేహమూ
ఒక దహనవాటికే!

               రత్నాల బాలకృష్ణ
                 విజయనగరం
          సెల్... 9440143488

కవితలు Whatsapp ద్వారా పంపండి

సెరీన్ మరియు ఒక ప్రశాంత సమయం  గ్రూపుల్లో వచ్చిన మంచి కవితలు ఎంపిక చేసి యువస్పందన పత్రిక లో ప్రచురిస్తాం.

ప్రధాన సంపాదకులు: డా.రామసూరి గారు
 సంపాదకులు :గవిడి శ్రీనివాస్, బసుపోతన
వ్యవస్థాపకులు: డా.రామసూరి గారు
యువస్పందన సంస్థ(08-April -1978)

కవితలు Whatsapp ద్వారా పంపండి. 
7019278368
srinivas.gavidi@gmail.com

దృష్టి బొమ్మ

దృష్టి బొమ్మ! -చిత్తలూరి


గాలి నిండా
మూఢ నమ్మకపు
తెరలు లేచాక
రంగు రంగుల బొమ్మలకు
బట్టలు చెదిరిపోతాయి
పంట చేను ముందు
దిష్టి బొమ్మలై
వాలిపోతాయి
మగాళ్ల నర దిష్టికి
ఆమె మంత్రమేస్తుంది సరే
ఆడవాళ్ల నర దిష్టికి
ఏ మగ బొమ్మను
పెడతాడో
అతన్నే అడిగి చూడాలి
విరగ కాసిన
పంట చేనులాంటి ఆమెను
ఇలా వాడుకోవాలని
అతనికెలా తెలిసిందో కానీ
ఎప్పుడూ
ఆమెలే గాయపడుతున్నారని
మాత్రం
అతనికి తెలిసే
అవకాశం లేదు
మగవాడి గడ్డం చేసుకునే
బ్లేడు దగ్గర కూడా
అమే అందమే
కత్తిగాటులా
తెగిపడుతున్న చోట
ఇప్పుడు కొత్తగా
పంట చేను ముందు
దిష్టి బొమ్మలా నిలబెట్టటం
ఏ నమ్మకమని మాత్రం
అతనికేం తెలుస్తుంది
ఇలాంటి మూఢనమ్మకాలను
చూస్తూ మనమంతా
దిష్టి బొమ్మలుగా
నిలబడినంత కాలం
ఈ సమాజం పట్ల
మనలోని దృష్టి బొమ్మ
మారనంత కాలం
తెరమీది బొమ్మలయినా
గుండె తెరమీది అమ్మలయినా
పంట చేలో గడ్డిబొమ్మల పక్కనో
కొత్త నిర్మాణాల ముందు
కోరలున్న రాక్షసుడి
వికృత రూపాల చెంతనో
అర్థనగ్న అందాల భామల
రూపంలో
దిష్టి బొమ్మలుగా చేరిపోతారు
నా చెమట చుక్కల శ్రమైక మూర్తులు
సిగ్గుతో తలవొంచుకుని
ఫ్లెక్సీ ముందునుంచి
మౌనంగా తరలిపోతారు!

      - చిత్తలూరి

అందమైన కవిత్వం

అందమైన కవిత్వం -పద్మావతి రాంభక్త
..............................
రోజూ కాసిని అక్షరాల గింజలను
చల్లకపోతే రోజంతా రెక్కలల్లార్చి కష్టించే రెప్పల పావురాలు
సేదదీరవు
కొన్ని పదసుమాలను పోగేసి
మునివేళ్ళతో వీలయినపుల్లా
దండలల్లకపోతే రోజంతా
పనులతో తలమునకలయ్యే
చేతికొమ్మలకు అలసటతీరదు
కొన్ని పరిమళభరితవాక్యాలను అనుభవాలతో మేళవించి
ఒక చక్కని కవితకు
జన్మనివ్వకపోతే నిత్యం బ్రతుకుబరిలో పోరాడి
భారమైన మనసు తేలికపడదు
కనీసం అప్పుడప్పుడయినా
కొన్ని అద్భుతకలాల నుండి జాలువారిన
అందమైన కవిత్వాన్ని
చదువుతూ  మైమరిస్తేనే  గానీ
మలినమైన మాటల
బరువును మోసుకుంటూ
నత్తనడకలా సాగిన జీవితం రసాస్వాదనతో ప్రక్షాళనై
కొత్త రంగులద్దుకుని
నవ్యోత్సాహంతో పరుగులు తీయదు
......పద్మావతి రాంభక్త

మల్లి

మల్లి
-Putcha Gayatri Devi

చల్ల గాలి వచ్చి నన్ను తాకినట్టు
బొండు మల్లె చెండు మురిసి నవ్వినట్టు
చిత్రిక పట్టిన టేకు చెక్కల్లె
వట్రంగ వంపులు తీర్చిదిద్దినట్టు

గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే
గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే

చిలకల జంట కువ కువలాడితే
చిగురుటాకులు రెండు తొంగి చూస్తూఉంటె
కరి మబ్బు చూసిన కేకికి మల్లె
నీరూపే గురుతొచ్చి మది నాట్యమాడెను

గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే
గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే

కొబ్బరి తోటలో నీటి బావిలగా
మండుటెండలోన వానజల్లులాగ
పొద్దున్న పాడేటి మేలుకొలుపులాగ
అమ్మపెట్టేటి సద్దిబువ్వలాగ

గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే
గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే

కంటి నిండా నిదుర కరవే అయ్యింది
పటికరాయి లాగ పలుకైన పలకవు
పగటిపూట ఉన్న చందురుడులాగ
కళ తప్పి నామోము వెలవెలబోయే

గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే
గురుతుకు వచ్చావే మల్లి
గుబులును పెంచావే

పి. గాయత్రిదేవి.

రైతు వాకిట్లో ...

రైతు వాకిట్లో ...
 -గవిడి శ్రీనివాస్ . 7019278368,9966550601

పొద్దు ఎంత అందంగా పూస్తుందో
గాలి ఎంత లేతగా తడుతుందో
మంచం మీద వాలిన కలలన్నీ
చుక్కల్ని లెక్కిస్తుంటాయి.
తెల్లవారు జాము మెలుకువ లో
ఎద్దుల్ని నాగళ్ళని రెప్పలు దాచిపెడుతుంటాయి.
వానకి ఎండకి ప్రతినిధిలా
సజీవమైన రైతు.
స్వచ్ఛమైన జీవన చిత్రానికి
ప్రతీక రైతు.
చినుకు మొలిసినప్పటి నుంచీ
చిగురు లా రోజుల్ని ముందుకి నెడుతూ
జీవన గమనం
ఆకు పచ్చని సాగమవుతుంది.
తొలకరికి చినుకులు మెరుపుల ఉరుములు
జీవితానుభవం లోంచి జారుకుంటాయి.
రైతు
వాకిట్లో  వాలిన
పొగ మంచు దుప్పట్లను దులుపుతూ
తెల్లారే సాలు సాలునా విరిసిన నాగలితో
రేపటి ఆశల పై 
ఆకుపచ్చని జెండా ఎగురేస్తాడు.