సమకాలీన ప్రాపంచిక పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ మానవ సమస్యల్ని విశ్లేషించి,
కళాత్మక సాహిత్య
రూపాలని అందించే కవులూ, రచయితలూ ఈనాడు చాలా అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని
ప్రజల జీవన పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. వ్యవసాయం, విద్య, వైద్యం వంటి ప్రాధమిక విషయాలపట్ల నిర్లిప్త ధోరణిలో
వ్యవహరిస్తున్న సందర్భమిది. ప్రపంచంలో ఏ మూల, ఏ మానవుడు కన్నీరు కార్చినా
స్పందించి కళాత్మక వ్యక్తీకరణతో ప్రశ్నించాల్సిన బాధ్యత సాహిత్య సృజనకారులపై ఉంది.
మానవ వనరులైన నదులూ, చెట్లూ, వ్యవసాయ భూములూ, గాలీ, నీరు అన్నీ వ్యాపార వస్తువులుగా మారి, వస్తు సంస్కృతి,
ఆయుధ సంస్కృతి,
అగ్రరాజ్యాల
ధనదాహానికి ప్రాతిపదికలైనాయి. వస్తువ్యామోహం, నిర్లిప్తత, ఆర్ధిక స్థితిగతులు, జాతి, కుల, మత, ప్రాంతీయ భేదభావాలు అభివృద్ధి చెందుతున్న దేశప్రజల జీవన
విధానంలో ఆందోళన కలిగించే అంశాలుగా ప్రవేశించాయి. వ్యవసాయ కూలీల జీవనం మరీ
దుర్భరంగా ఉంది. శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడు. ‘ప్రపంచమొక కుగ్రామమవుతుంది.
జీవితమొక సంగ్రామమవుతుంది' అని.
శ్రీశ్రీ కవిత్వంలోని ప్రచారగుణం కళాత్మకమై యువతరం హృదయాలని స్పందింప చేసింది.
ఈనాటి కవులు తమ భావాలని ఎంత ప్రతిభావంతంగా చెప్పగలిగినప్పటికీ యువ హృదయాలని
ఆకర్షించలేకపోవటానికి కారణాలని మనం విశ్లేషించుకోవాలి. కళాశాలల్లో కళా సాంస్కృతిక
ప్రయత్నం లేకపోవడంతో చైతన్యాన్ని కోల్పోతున్నాయి.
‘యువకాశలనవపేశల సుమగీతావరణం’ కనుమరుగవుతోంది. సారవంతమైన భూములు స్వార్ధపరుల రాజకీయాలకి నిస్తేజమైపోతున్నాయి. చెట్టూ చేమా, కొండాకోనా, పక్షులూ, నదులూ చివరకి సముద్రాలూ
ప్రకృతిలో సమతౌల్యాన్ని దెబ్బ తీసే
మానవ స్వార్ధానికి బలవుతున్నాయి. ‘మానవత లేని లోకాన్ని స్తుతింపలేను. మానవునిగా శిరసెత్తుకుని తిరగలేను ' అన్న తిలక్ వాక్యాలు
గుండెలని కదిలిస్తున్నాయి. శ్రీశ్రీ
కవిత్వంలో ప్రపంచ మానవ హృదయ స్పందన అక్షర రూపమై, మహా ప్రస్థానమై తెలుగు కళా
సాంస్కృతిక రంగంలో కదలిక తెచ్చింది.
ప్రసార మాధ్యమాలు, పత్రికలూ తక్షణ సంస్కృతి (Instant Culture) వ్యామోహంలో పడి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని కొత్త తరానికి
హృదయాన్ని తాకేలా అందించలేకపోతోంది. జాతీయ ఉద్యమం, భూదానోద్యమం, రైతు ఉద్యమాలూ, భూమి సమస్యలకు సంబంధించిన నిబద్ధత కలిగిన ఉద్యమాలు
నిస్తేజమై స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ఉద్యమాలు కొత్త తరహాలో బయలుదేరినాయి.
భారతదేశంలోని భూమి పరిమళాన్ని, అంతఃసౌందర్యాన్ని , తరతరాల వ్యవసాయ సంస్కృతి తెలిసినవారు పౌష్టికాహారం
లభించని కోట్లాది వ్యవసాయ కూలీలే వారి జీవనస్థితిగతులని మెరుగుపరిచే సాహిత్యాన్ని
సృష్టించాలి. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన కవులూ, రచయితలూ వారి వారి జీవన
నేపథ్యాలలోంచి చక్కని నుడికారంతో,
మాండలికంతో,
సామెతలూ, సంస్కృతి అన్నింటినీ
వ్యక్తం చేస్తున్న రచనలు రావడం తెలుగు సాహిత్యంలో
గమనించదగ్గ పరిణామం. సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించే మంచి విమర్శకులు
లేకపోవడం లోఫంగానే భావించాలి. కవులూ, రచయితలూ విశాల భావ సంస్కృతి ప్రతిబింబించే రచనలు
చేసినప్పుడే మన సాహిత్యానికి గుర్తింపు వస్తుంది..
మన నేలలోంచి, మన నదుల తీరాలలో వికసించిన మానవ సాంస్కృతిక నేపధ్యంలోంచి సమగ్ర మానవ
జీవితంలోని భిన్న అంశాలని స్పృశిస్తూ, సమకాలిక సంక్షోభానికి కారణాలని అన్వేషించే తాత్విక స్థాయిని పెంపొందించుకుంటూ ఉజ్వలమైన జీవితాన్ని కాంక్షించే పద్ధతిలో రచనలు చేస్తే
తెలుగు సాహిత్యం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంది.
'యువస్పందన' పత్రిక దీపావళి సందర్భంగా
శరత్సంచికగా మీ చేతుల్లో ఉంటుంది. యుద్ధాలకి అనువైన ఋతువు శరదృతువు.
మానవుడు తన మెదడుకీ, హృదయానికీ జరుగుతున్న యుద్ధంలో హృదయం గెలిచేలా చేసుకోవాలి. అప్పుడే మంచి
గంధంలా పరిమళించి, మానవత్వం సాహిత్యాన్ని రసవంతం చేస్తుంది. అలాంటి సాహిత్యానికి మా ఆహ్వానం..
editorial is very impressive and i think it is very helpful to the upcoming writers like me and the designing and the frame work of the magzine is very simple and attractive and i hope this magzine will work as a bridge to come into the limelight to the young talented writers i wish all the best to this magzine and the working members behind this. it is a good effort by yuvaspandana
రిప్లయితొలగించండిyuvaspandana srustukartalaku namassumanjali. oka manchi prayatnam to manchi aarambhanni ichina vidhanam chala bagunnadi roju rojuku perugutunna technology ni manaku upayogapadevidhanga ante ituvanti manchi vishayalanu , viseshalanu andariki cherche vaaradhiga upayogistunnanduku chala santoshamga unnadi. naa lanti telugu abhimaanulaku(telugu maatrme telisina vallu anukovatam inkamanhidemo?) chala upayogapdutundani aasistunnanu. mee nunchi raaboye adbhuta sankalanala sumaalikala kosam eduruchustu unde mee abhimani.............mallikharjunarao.
రిప్లయితొలగించండి