రచన: ఎస్.కె.బాబు
అమ్మాయి పెళ్ళీ
అదిరిపోవాలన్నారు
అబ్బాయి తరఫువారు
ఏం చేయాలో సెలవిమ్మన్నాక
విప్పాడో పెద్ద చిట్టా వాళ్ల
పెద్దబ్బాయి
ఇంతవరకు ఎవ్వరూ వేయనంత గొప్ప శుభలేఖ
వుండాలని
మెల్బోర్న్ మరిపించే విద్యుత్
అలంకరణలు
ఊరేగింపులో దారి పొడుగునా
బాణాసంచా వెల్లి వెరియాలన్నారు
బాజా భజంత్రీలు మారు మ్రోగాలన్నారు
అలాగే
కానీ
చెట్లు నరకని కాగితంలో చేసిన
శుభలేఖలు వుంటే
అలాగే కానీమన్నాను
వెలుగుతో పాటు
వేడిని వెదజల్లని విద్యుత్ వుంటే
అలాగే కానీమన్నాను
కాంతులే తప్ప
కాల్పులు లేని బాణాసంచా వుంటే
అలాగే కానీమన్నాను
డెసిబెల్స్, అంటే ఏమిటో
నేటి భజంత్రీగాళ్ళకు తెలిస్తే
అలాగే కానీమన్నాను
అమ్మాయి పెళ్ళీ అదిరేలా చేద్దాం
కాస్తా నాతో కోపరేట్ చేస్తే లోక
కళ్యాణమే చేద్దాం రండి
నాతో చేయి కలపండి
***************************
అమ్మాయి పెళ్ళి చాలా బాగుంది.అభినందనలు.
రిప్లయితొలగించండి