వాన....
అంతా నిద్ర లో
ఉన్నప్పుడునేనూ ఆ లోకంలో కే ఎగిరిపోదామనుకుంటాను
అటూ ఇటూ ఎటూ కాని చోటే నేనుంటూ ఉంటాను
అప్పుడొస్తుంది సుడిగాలి లా వాన.
గల గలా మొదలవుతుంది..
కాస్సేపా చప్పుడు చెవులకింపుగా తోస్తుంది..
ఒకే ఒక్క చిట్టి దీపం ఉంటుంది
మిగతాదంతా చీకటే..
అప్పుడు గాని తెలియదు నేను మిణుకు మిణుకుమంటూ మాత్రమే ఉన్నానని.
పెదవుల మీద గమ్మత్తైన నవ్వు..
దానికొక అర్ధం వెతకడం కష్టం ..
ఇంకింతే అనిపిస్తున్నట్టుంటుంది.
జీవితం కమనీయమేమో తెలియదు
నాకు మాత్రం బయటి గాఢాంధకారంలో
జోరందుకుని ఒకటే రొదలా దబ దబా కురిసే వర్షంలా తోస్తుంది
కడుపు లో అరగక గుడ గుడా చేసే పేగుల అరుపుల్లా.
అర విరిసిన విరజాజులు
చిగురు తొడిగే లేతాకులు
చంటిపాపా మింటి నవ్వు
చిలిపి యవ్వనపు గుబులు
ఇవన్నీ అప్పుడప్పుడు భవిష్యత్ దెబ్బ తాకిడికి మందు పూతలా
కటిక చేకటిలో భోరుమనే వర్షపు చప్పుళ్ళు గుండె భరించక తప్పదు.
ఇది నిజం!
ఇదో సత్యం !
*****
రచన : సరోజ బులుసు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి