![]() |
| రచయిత శ్రీ బాలకృష్ణ కు సన్మానం |
21, జూన్ 2016, మంగళవారం
తరవాణి నానీలు పుస్తకావిష్కరణ - రచయిత శ్రీ రత్నాల బాలకృష్ణ
17, ఏప్రిల్ 2016, ఆదివారం
నిశాంత స్వప్నం - రచన మెర్సీ మార్గరెట్
" నిశాంత స్వప్నం"
------------------
పొడిగించిన
రెక్కలపై ఉదయించిన కిరణం
రెక్కల
కిందటి చీకటిని గేళిచేస్తే
పొదగబోయే
గుడ్డుని పొదివిపట్టుకునే చీకటి
ఆర్ణవగీతాన్ని
లిఖించడం మానదు
సూర్యుడొక
రెక్కన
భూమినింకోరెక్కన
మోస్తున్న పక్షికి
అనంతాల
ఊహలు కాలిగజ్జలే
ఇసుక
రేణువులుగా
వదిలొచ్చిన
కాలాన్ని కూర్చుకుంటూ నీవు
ఆబగా
ఎదురుచూసే ఆ బిచ్చగాడి గిన్నె
లెక్కలేనన్ని
అన్నపు మెతుకుల
ప్రశ్న
జవాబుల పత్రాల జీవితపుపెట్టె
ఇలారా
ఒకమేఘమై
పింగాణీ
దేహాన్ని విడిచి
మట్టిదీపపు
కాంతిలో పాదాల్ని తడుపుకుని
స్పర్శకోల్పోయిన
దేహాలపై
పాదరస
వర్షమైకురుద్దాం
వెలుతురు
సోకని మరణమార్గాల గుండా
కాంతి
అడుగుల విత్తనాలు నాటివద్దాం
-----
రచన
: మెర్సీ మార్గరేట్
9052809952 వాన - రచన సరోజ బులుసు
వాన....
అంతా నిద్ర లో
ఉన్నప్పుడునేనూ ఆ లోకంలో కే ఎగిరిపోదామనుకుంటాను
అటూ ఇటూ ఎటూ కాని చోటే నేనుంటూ ఉంటాను
అప్పుడొస్తుంది సుడిగాలి లా వాన.
గల గలా మొదలవుతుంది..
కాస్సేపా చప్పుడు చెవులకింపుగా తోస్తుంది..
ఒకే ఒక్క చిట్టి దీపం ఉంటుంది
మిగతాదంతా చీకటే..
అప్పుడు గాని తెలియదు నేను మిణుకు మిణుకుమంటూ మాత్రమే ఉన్నానని.
పెదవుల మీద గమ్మత్తైన నవ్వు..
దానికొక అర్ధం వెతకడం కష్టం ..
ఇంకింతే అనిపిస్తున్నట్టుంటుంది.
జీవితం కమనీయమేమో తెలియదు
నాకు మాత్రం బయటి గాఢాంధకారంలో
జోరందుకుని ఒకటే రొదలా దబ దబా కురిసే వర్షంలా తోస్తుంది
కడుపు లో అరగక గుడ గుడా చేసే పేగుల అరుపుల్లా.
అర విరిసిన విరజాజులు
చిగురు తొడిగే లేతాకులు
చంటిపాపా మింటి నవ్వు
చిలిపి యవ్వనపు గుబులు
ఇవన్నీ అప్పుడప్పుడు భవిష్యత్ దెబ్బ తాకిడికి మందు పూతలా
కటిక చేకటిలో భోరుమనే వర్షపు చప్పుళ్ళు గుండె భరించక తప్పదు.
ఇది నిజం!
ఇదో సత్యం !
*****
రచన : సరోజ బులుసు కాశిరాజు కవిత్వం
దేహమును ప్రేమించుమనీ, మోహమన్నది
పెంచుమనీ ఒంటి మాటలకు అంటి పెట్టుకుని ఆ వీలు కుదుర్చుకున్న సాయంత్రాల్లో నేనడిగిన
దేహానికీ, నువ్విచ్చిన
సందేహానికీ అహాన్ని అక్కడ స్కలింపజేసి నీ అన్ని దానములలో సమాధానము ఘనమైనదనీ నేను
పడ్డపుడూ, సమాదానపడ్డపుడూ
ఆ ఓర్పు నాకు గర్వకారణము. అందుకు మళ్ళీ నేను సర్వదా కృషిచేసి నీ దేహ సంపదను
కాపాడుతానని ప్రతిజ్ఞ్య చేస్తాను. ఎప్పటిలాగానే నవ్వి నా చేతులని తొలగించేసాక
జాలితో వద్దనకుండా ముద్దిచ్చి నువ్వందించిన సానుభూతి అనుభూతి బహు బాగు బాగు.
నిజం చెప్పు అప్పుడే కదా యావత్ మగజాతినీ పెద్ద మనసుతో చిన్న చూపు చూసీ ఓ ముద్దుతో చక్కబెట్టేయగలనని అనుకున్నది. ఆ సముద్రం ఒడ్డున కాలి బొటనవేలితో గుచ్చితే మెరిసిన ఆ ఇసకలో పొడితనంలో తడితనాన్ని నాలో నువ్వెపుడూ చూడలేదా? అయితే సముద్రం దగ్గర ఆకాశం భూమీ కలిసే వీలుందనీ అక్కడ మనమూ కలవచ్చుననీ ఇకపై అబద్ధం చెప్పకు. ఎగసి పడుతున్న కెరటాల్ని చూపించి తీరాల దగ్గరదాకా నన్ను తీసుకెళ్ళి వదిలేయకు. సరదాగానో నిజంగానో నువ్వు అప్పుడప్పుడూ నన్ను సముద్రమ్మని నిజమైతే తీరాల్నితాకని సముద్రం ఎచ్చోటనూ లేదని తెలుసు నీకు.
నిజం చెప్పు అప్పుడే కదా యావత్ మగజాతినీ పెద్ద మనసుతో చిన్న చూపు చూసీ ఓ ముద్దుతో చక్కబెట్టేయగలనని అనుకున్నది. ఆ సముద్రం ఒడ్డున కాలి బొటనవేలితో గుచ్చితే మెరిసిన ఆ ఇసకలో పొడితనంలో తడితనాన్ని నాలో నువ్వెపుడూ చూడలేదా? అయితే సముద్రం దగ్గర ఆకాశం భూమీ కలిసే వీలుందనీ అక్కడ మనమూ కలవచ్చుననీ ఇకపై అబద్ధం చెప్పకు. ఎగసి పడుతున్న కెరటాల్ని చూపించి తీరాల దగ్గరదాకా నన్ను తీసుకెళ్ళి వదిలేయకు. సరదాగానో నిజంగానో నువ్వు అప్పుడప్పుడూ నన్ను సముద్రమ్మని నిజమైతే తీరాల్నితాకని సముద్రం ఎచ్చోటనూ లేదని తెలుసు నీకు.
తడి - రచన చెళ్ళపిళ్ళ శ్యామల
తడి
రచన: చెళ్ళపిళ్ళ శ్యామల
మొబైల్: 9949831146
ఎక్కడో – ఉండనే ఉంటుందది.
ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతుంది!
చరిత్ర పుటల్లో
మూసుకుపోయినా
తెరిచిన తాళం చెవిలా
ఎక్కడో చోట
తెరుచుకుంటుంది.
ఆనందాల
రెక్కలు తొడిగి
వరికుచ్చుకై
పిచ్చుకెగిరినట్టు
గాలిపటమై
ఎగరాల్సిన బాల్యం
రెక్కలు
తిరిగి
కార్పోరేట్
చదువుల పంజరంలో
బంధీగా
మారినాసరీ,
ఆశల రంగవల్లులతో
మమతల గొబ్బిళ్ళతో
ముంగిట నందనం
మొలిపించేందుకు
పిడికెడు మట్టి ముంగిట
లేకపోయినా సరే,
చలోక్తులు
సామెతలు
జాతీయాలు
నుడికారాలు
నింపుకుని
–
చమత్కారాల
సుడులతో
సెలయేటిల
సాగిన భాష
పడగెత్తిన
పాశ్చ్యాత్య సునామి దాడికి
నెల
పొదల్లో ఇంకినా సరే,
కులాసా కోడిపందేలతో
హుహుషారెక్కిన కుర్రకారు
నిషా మత్తులో జోగుతున్నా సరే,
నిహారిక తెరల మాటున సాగిన
హరిదాసుల గానాలు
సినీ శబ్ద తరంగాల హోరులో
మునిగిపోయినా సరే,
డూ
డూ బసవన్నా అంటూ ఆడిస్తే
కనువిందు
చేసే గంగిరెడ్లు
దూడగా
పుట్టిల పాపానికి
తల్లి
పాలే కరువై
అర్దాయుష్కులై
పోతున్నా సరే,
ఉమ్మడి కుటుంబాలు
మట్టి కుండలై విడిపోతున్నా సరే,
ఎక్కడో ఉంటుందది.
మనసు మైదానం పై,
మమతల జల్లు కురిసినప్పుడో
ఆర్ధిక సంబంధాలు –
పాములై బుసలు కొట్టినప్పుడో
ఎక్కడో చోట
మనసుకి మట్టి తగిలితే చాలు –
జారిన జ్ఞాపకాలన్నీ
తడి తడి గా కదిలి
తేనె తీగలై మదిని
చుట్టేస్తాయి.
******
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)




