16, మే 2013, గురువారం

నిశాంత స్వప్నం - రచన మెర్సీ మార్గరెట్



నిశాంత స్వప్నం"
------------------


పొడిగించిన రెక్కలపై ఉదయించిన కిరణం 
రెక్కల కిందటి చీకటిని గేళిచేస్తే
పొదగబోయే గుడ్డుని పొదివిపట్టుకునే చీకటి
ఆర్ణవగీతాన్ని లిఖించడం మానదు

సూర్యుడొక రెక్కన 
భూమినింకోరెక్కన మోస్తున్న పక్షికి
అనంతాల ఊహలు కాలిగజ్జలే

ఇసుక రేణువులుగా  
వదిలొచ్చిన కాలాన్ని కూర్చుకుంటూ నీవు  
ఆబగా ఎదురుచూసే  ఆ బిచ్చగాడి గిన్నె
లెక్కలేనన్ని అన్నపు మెతుకుల 
ప్రశ్న జవాబుల పత్రాల జీవితపుపెట్టె

ఇలారా ఒకమేఘమై
పింగాణీ దేహాన్ని విడిచి
మట్టిదీపపు కాంతిలో పాదాల్ని తడుపుకుని
స్పర్శకోల్పోయిన దేహాలపై 
పాదరస వర్షమైకురుద్దాం
వెలుతురు సోకని మరణమార్గాల గుండా
కాంతి అడుగుల విత్తనాలు నాటివద్దాం
-----
రచన :  మెర్సీ మార్గరేట్ 
9052809952 

1 కామెంట్‌: